జర్నలిస్ట్ కేవీఆర్‌ ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు..బోరున విల‌పించిన భార్య‌

by velandi.Saikiran |   (  Updated:2026-06-30 21:35:44  IST  )

తెలంగాణ జర్నలిస్టు కేవీ రెడ్డిని మరోసారి ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

జర్నలిస్ట్ కేవీఆర్‌ ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు..బోరున విల‌పించిన భార్య‌
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ జర్నలిస్టు కేవీ రెడ్డిని మరోసారి ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనే KVRను అరెస్టు చేసి, వివాదానికి తెర‌లేపిన‌ ఏపీ పోలీసులు.. ఇప్పుడు మరోసారి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రిపూట హైదరాబాద్ చేరుకున్న విజయనగరం జిల్లా బాడంగి స్టేషన్ కు పోలీస్ అధికారులు..మఫ్టీలో కేవీ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన భార్య కన్నీళ్లు పెడుతూ వారించినప్పటికీ విన‌లేదు ఏపీ పోలీసులు. వారెంట్ ఉందని చెబుతూనే, ప్రైవేట్ వాహనంలో ఏపీకి తరలించారు. అయితే ఏపీకి తీసుకు వెళ్లే ముందు, సరూర్ న‌గర్ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చారు. అనంతరం కేవీ రెడ్డిని ఏపీకి తరలించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ పై క‌ల్వ‌కుంట్ల క‌విత స్పందించారు. కేవీ రెడ్డి అరెస్ట్ తెలంగాణ పోలీసులు సహకరించడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. వెంట‌నే కేవీ రెడ్డిని విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

Next Story