నిధుల కొరతతో వైద్యశాఖ హెడ్‌ ఆఫీసులు..రెండేళ్లుగా ఇదే పరిస్థితి!

by velandi.Saikiran |   (  Updated:2026-06-30 22:31:20  IST  )

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డీపీహెచ్, డీఎంఈ ప్రధాన కార్యాలయాలు రెండేళ్లుగా నిధుల కొరత తో కొట్టమిట్టాడుతున్నాయి.

నిధుల కొరతతో వైద్యశాఖ హెడ్‌ ఆఫీసులు..రెండేళ్లుగా ఇదే పరిస్థితి!
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డీపీహెచ్, డీఎంఈ ప్రధాన కార్యాలయాలు రెండేళ్లుగా నిధుల కొరత తో కొట్టమిట్టాడుతున్నాయి. స్టేషన రీ, సురక్షితమైన తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు సొంత డబ్బు లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్ప డింది. ప్రభుత్వ కార్యాలయాల రో జువారీ ఖర్చులకు కేటాయించే నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో స్టేషనరీ సరఫరాదారులు, వాటర్ క్యాన్ వెండర్లకు బిల్లు లు చెల్లించలేదు. దీంతో సరఫరాలు నిలిచిపోయాయి. కార్యాలయాల్లో ఫైల్ నోటింగ్‌లు, జీవో ప్రింటింగ్‌ లు, అంతర్గత సర్క్యులర్ల జారీ వంటి పనులకు అవసరమైన ఏ4 పేపర్లు, పెన్నులు, రిజిస్టర్లు కూడా అందుబాటులో లేక ఉద్యోగులే కొనుగోలు చే స్తున్నారు. ఇటీవల లక్షల రూపాయ ల విద్యుత్ బిల్లులు కూడా పెండింగ్‌ లో ఉండగా, విద్యుత్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసిన ట్లు సమాచారం. సాధారణ వినియోగదారుల మాదిరిగా కనెక్షన్ కట్ చేయకుండా బకాయిలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు.

తాగునీటికీ ఇబ్బందులు

వాటర్ క్యాన్ సరఫరాదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో సుర క్షిత తాగునీటి సరఫరా ఆగిపోయిం ది. కార్యాలయాలకు వచ్చే ప్రజలు, రోగుల బంధువులు, ఉద్యోగులకు కనీసం తాగునీరు అందడం లేదు. ఉద్యోగులు ఇళ్ల నుంచే నీళ్లు తెచ్చుకుంటుండగా, సందర్శకులు బయ ట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ సమస్యలపై పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి నివేదించి నా పరిష్కారం కనిపించకపోవడం తో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని అధికారులు, ఉద్యోగు లు కోరుతున్నారు.

పట్టించుకోని హెచ్ఓడీలు

ప్రభుత్వం నుంచి నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాల్సిన డీపీహెచ్, డీఎంఈ అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా వెండర్లకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బకాయిలు పేరుకుపోవడంతో సరఫరాలు నిలిచిపోయాయి. ఒక్కో ప్రధాన కార్యాలయానికి నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు, సంవత్సరానికి రూ.25 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు బడ్జెట్ అవసరమవుతుంది. ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు కేటాయించినప్పటికీ ప్రధాన కా ర్యాలయాల అంతర్గత నిర్వహణ ఖర్చులకు నిధులు సకాలంలో విడుదల కాకపోవడం సమస్యలకు తీవ్రమైన కారణం అవుతోంది.

ప్రతి మూడు నెలలకు..

నిబంధనల ప్రకారం బడ్జెట్‌ ను నాలుగు విడతలుగా, అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేయాలి. ప్రతి త్రైమాసికానికి ఒక్కో కార్యాలయానికి రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలు అందా ల్సి ఉండగా, ట్రెజరీలో “గ్రీన్ ఛానల్”లో బిల్లులు క్లియర్ కాకపోవడంతో నిధులు నిలిచిపోతున్నట్లు తెలిసింది.

Next Story