- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేవీ రెడ్డి అరెస్ట్..ఏపీ పోలీసులపై కవిత సీరియస్
జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ కు తెలంగాణ పోలీసులు సహకరించడం సిగ్గుచేటు అంటూ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ కు తెలంగాణ పోలీసులు సహకరించడం సిగ్గుచేటు అంటూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని లాక్కొని వెళ్తుంటే హృదయ విదారకంగా ఆయన భార్య, చిన్నపిల్లలు ఏడుస్తున్న తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకొని ఏపీ పోలీసులకు సహకరించడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు.
తెలంగాణ జర్నలిస్ట్ ల అరెస్ట్ కు సహకరిస్తున్న ఇక్కడి పోలీసులు మన గడ్డ మీది నుంచి తెలంగాణావాదాన్ని వేర్పాటు వాదం అంటూ వ్యాఖ్యలు చేసిన సినిమా నటుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని సీరియస్ అయ్యారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి తొత్తుగా ఉండొచ్చు కానీ, తెలంగాణ జర్నలిస్టులు, ప్రజలకు ఆ అవసరం లేదన్నారు. తెలంగాణ మేధావులు, జర్నలిస్టులపై దాడులను ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు. వెంటనే కేవీ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేవీ రెడ్డి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని తెలిపారు కవిత.






