రాజు వెడ్స్ రాంబాయి' హీరో అఖిల్ రాజ్‌పై దాడి !

by velandi.Saikiran |

రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్‌పై దాడి జ‌రిగిన‌ట్లు వీడియో వైర‌ల్ గా మారింది.

రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్‌పై దాడి !
X

దిశ‌, వెబ్ డెస్క్: రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్‌పై దాడి జ‌రిగిన‌ట్లు ఓ వీడియో వైర‌ల్ గా మారింది. కొండాపూర్‌లో అఖిల్ రాజ్ కారును అడ్డగించి, గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. ఇక ఈ సంఘ‌ట‌న‌పై వెంట‌నే గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు హీరో అఖిల్ రాజ్‌. అటు డెలివరీ బాయ్‌పై కూడా ఫిర్యాదు చేసినట్లు స‌మాచారం అందుతోంది. ఇక హీరో అఖిల్ రాజ్ ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. కాగా, అఖిల్ రాజ్ కారును అడ్డగించి, దాడికి పాల్ప‌డిన వీడియో వైర‌ల్ గా మారింది.

డెలివరీ బాయ్ పై దాడి..క్లారిటీ ఇచ్చిన అఖిల్

డెలివరీ బాయ్​పై దాడి వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ స్పందించారు. డెలివరీ బాయ్​ తప్పుడు అడ్రస్​లో ఇచ్చివెళ్లి.. కొద్దిసేపటి తర్వాత మళ్లీ వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని తెలిపారు. అంతేకాకుండా మద్యం మత్తులో మా అమ్మని కూడా దుర్భాషలాడాడని వివ‌రించారు. నేను కూడా ఒకప్పుడు డెలివరీగా బాయ్​గా పనిచేసి ఈ స్థాయికి వచ్చానని క్లారిటీ ఇచ్చారు అఖిల్ రాజ్. క్లిక్

Next Story