ఓ స్టార్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఆ సినిమా కోసం 18 నెలలు సోషల్ మీడియాకు బ్రేక్

by Chukka Sudharani |

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్.. ప్రజెంట్ వరుస సక్సెస్‌లతో ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు.

ఓ స్టార్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఆ సినిమా కోసం 18 నెలలు సోషల్ మీడియాకు బ్రేక్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్.. ప్రజెంట్ వరుస సక్సెస్‌లతో ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది వచ్చిన ‘ధురంధర్ 2’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ ‘ప్రళయ్’పై ఫోకస్ పెట్టాడు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘స్కామ్ 1992’ఫేమ్ హన్సన్ మెహతా కుమారుడు జై మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ జాంబీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని రణవీర్ తన సొంత బ్యానర్ ‘మా కసం ఫిలిమ్స్’ ద్వారా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాలో మొదలు పెట్టనున్నట్టు సమాచారం. రూ.300Cr భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ లెవల్ VFX టీమ్‌తో హై లెవల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. Don3 వివాదం ఈ సినిమాకు ఎఫెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో రణవీర్ సోషల్ మీడియాకు 18 నెలలు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. అలాగే తన పూర్తి ఫోకస్ ‘ప్రళయ్’పై పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుండగా.. ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Next Story