- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 8 కోట్లు ఎగ్గొట్టారు.. మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన ప్రముఖ డైరెక్టర్
‘పరాశక్తి’ సినిమా రెమ్యునరేషన్ విషయంలో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు దర్శకురాలు సుధా కొంగర.

దిశ, సినిమా: ‘పరాశక్తి’ సినిమా రెమ్యునరేషన్ విషయంలో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు దర్శకురాలు సుధా కొంగర. సుధా కొంగర దర్శకత్వంలో డాన్ పిక్చర్స్ నర్మించిన ‘పరాశక్తి’ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. 2026లో విడుదలై ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపించి తనకు ఇవ్వాల్సిన మిగిలిన రెమ్యునరేషన్ రూ. 8 కోట్లు ఎగ్గొట్టారని మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది దర్శకురాలు సుధా కొంగర. ఆమెకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించకుండానే ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ ‘ఇదయం మురళి’ అనే మరో సినిమాను నిర్మించి విడుదల చేయాలని చూస్తుందని సుధ కొంగర తరపు కౌన్సిల్ కోర్టులో వాదించింది. దీంతో సుధా కొంగరకు పూర్తి పారితోషికం చెల్లించేంత వరకు ‘ఇదయం మురళి’ సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టు సదరు నిర్మాణ సంస్థను ఆదేశించింది. అంతేకాకుండా.. ఈ కేసు తదుపరి విచారణ జరిగే వరకు ‘పరాశక్తి’ సినిమాను శాటిలైట్‌లో కూడా విడుదల చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.






