- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్కులో గర్భస్థ ఆడ శిశువు మృతదేహం లభ్యం
by Batti.Sumithra |
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, రాజేంద్రనగర్ : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఐదు నెలల గర్భస్థ ఆడ శిశువు మృతదేహాన్ని మైలార్‌దేవ్‌పల్లి పార్కులో గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి పార్కులో గర్భస్థ శిశువు మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఆడ శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పార్కు సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. శిశువు మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






