రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

by Ratna Kumari |

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
X

దిశ, దుండిగల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్వాల్ ప్రాంతానికి చెందిన గుమ్మడి ఉదయలత (49) తన కుమారుడు గుమ్మడి వేదాంత్ రెడ్డి (22)తో కలిసి బొల్లారం నుంచి బహదూరపల్లిలోని టెక్ మహీంద్రా యూనివర్సిటీకి ద్విచక్ర వాహనం (టీజీ08ఏఎల్1514)పై బయలుదేరారు. బహదూరపల్లి హనుమాన్ ఆలయం సమీపంలోని రుచి కేఫ్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బులెరో వాహనం (టీజీ08యూహెచ్7291) వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయలత తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా, వేదాంత్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఎస్‌వీ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం బులెరో వాహనం ఎకో స్పోర్ట్స్ కారు (టీఎస్08ఎఫ్ఎల్7715)తో పాటు మరో రెండు ద్విచక్ర వాహనాలను కూడా ఢీకొట్టడంతో అవి దెబ్బతిన్నట్లు సమాచారం. బులెరో వాహన డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలి సోదరుడు గూడూరు శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Next Story