- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిజన బస్తీలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

దిశ, బాలానగర్ : బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిజన బస్తీలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. హరిజన బస్తీకి చెందిన టేక్మాల్లా శ్రీకాంత్ (28) మద్యం సేవించి తరచూ భార్య, కుటుంబ సభ్యులతో గొడవపడేవాడని సమాచారం. సోమవారం రాత్రి కూడా కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతని భార్య యామిని, ఆమె తల్లి పక్కింట్లో నిద్రించినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా శ్రీకాంత్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య యామిని ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






