- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోహగఢ్ కోటకు ‘సియా పాయింట్’ పేరు.. పెరిగిన పర్యాటకులు
కేతన్ అగర్వాల్ హత్య ఉదంతంతో లోహగఢ్ కోట వార్తల్లో నిలిచింది. దీంతో ఒక్క సారిగా ఈ కోటకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో : యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య ఉదంతం మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అయితే అతడు హత్యకు గురైన లోహగఢ్ కోట వార్తల్లో నిలవడంతో పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఈ చారిత్రక కోటను సందర్శించే వారి సంఖ్య దాదాపు 25 శాతం పెరిగినట్లు సమాచారం. పూణే సమీపంలోని ఈ కోటపైకి వెళ్లిన సమయంలో కేతన్ అగర్వాల్‌ను సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి నెట్టేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతానికి పర్యాటకులు అనధికారికంగా ‘సియా పాయింట్’ అని పేరు పెట్టారు. కోటను సందర్శించే వారు అక్కడి భద్రతా సిబ్బందిని, గైడ్లను, తోటి ట్రెక్కర్లను హత్య జరిగిన ఖచ్చితమైన స్థలాన్ని చూపించమని అడుగుతున్నారు. ఒకప్పుడు కేవలం అందమైన ప్రకృతి దృశ్యాలు, ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఈ కోట ఇప్పుడు మరో రకంగా ఫేమస్ అయ్యింది. సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉన్న ఈ లోహగఢ్ కోట మహారాష్ట్రలోని వారసత్వ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ కోటకు దాదాపు 2 వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉందని, ఇది శాతవాహనుల కాలానికి చెందినదని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తులో భాగంగా లోనవ్లా రూరల్ పోలీసులు మంగళవారం లోహగఢ్ కోటను మూసివేశారు. దీనిపైకి పర్యాటకులను అనుమతించడం లేదు.






