రైతుల సమస్యలపై రాజకీయాలు మానుకోవాలి

by Ratna Kumari |

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, బుద్ధారం చెరువు ముంపు ప్రభావిత రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని గోపాలపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్, బుద్ధారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోటుక చంద్రయ్య అన్నారు.

రైతుల సమస్యలపై రాజకీయాలు మానుకోవాలి
X

దిశ, గోపాలపేట : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, బుద్ధారం చెరువు ముంపు ప్రభావిత రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని గోపాలపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్, బుద్ధారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోటుక చంద్రయ్య అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బుద్ధారం చెరువు ముంపు బాధిత రైతుల సమస్యను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ, గ్రామ సర్పంచ్ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గోపాలపేట మండలంలోని ముంపు ప్రభావిత రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ రైతులతో సమావేశమై నష్టపరిహారం పెంపుపై సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న సమయంలో రైతులను ఆందోళనలకు ప్రేరేపించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం రైతుల డిమాండ్లను పరిశీలించి పరిహారం పెంచేందుకు సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలిపినప్పటికీ, ధర్నాలు నిర్వహించడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, న్యాయమైన పరిహారం అందే వరకు కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన నిలుస్తుందని హామీ ఇచ్చారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల బిల్లులపై స్పందన..

బుద్ధారం గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల బిల్లులు అప్పట్లోనే ఎందుకు విడుదల కాలేదో అప్పటి పాలకులు సమాధానం చెప్పాలని చంద్రయ్య డిమాండ్ చేశారు. ఆ సమస్యలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, రైతులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ చైర్మన్ పెంటారావు, మాజీ ఉపసర్పంచ్ కావలి నాగరాజు, ఎల్లగౌడ్, వార్డు సభ్యుడు నరేందర్ గౌడ్, తిరుపతయ్య, పర్వతాలు, మద్దిలేటి, హన్మంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story