- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రో ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. ప్రత్యేక సుంకం విధింపు
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా కేంద్రం పెట్రోల్, డీజిల్, ATF ఎగుమతులపై ప్రత్యేక సుంకం విధించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై ప్రత్యేక సుంకం (Special Export Duty) విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో ఒడిదుడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో, దేశీయ మార్కెట్లో ఇంధన కొరత రాకుండా ముందస్తుగా ఈ చర్యలు చేపట్టినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయతే, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త ఎగుమతి సుంకం రేట్లు జూలై 1 నుంచి అంటే రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. అధికారిక ఉత్తర్వల మేరకు పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.4, డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ.8.5, విమాన ఇంధనం (ATF)పై లీటరుకు రూ.7.5 చొప్పున ఎగుమతి సుంకం విధించారు.
పొరుగు దేశాలకు మినహాయింపు..
ఇక భారత్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే పొరుగు దేశాలు, మిత్ర దేశాలకు ఈ ఎగుమతి సుంకం నుంచి కేంద్రం మినహాయింనిచ్చింది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు మారిషస్, మాల్దీవులకు చేసే ఇంధన ఎగుమతులపై ఈ ప్రత్యేక సుంకం వర్తించదని స్పష్టం చేసింది. అదేవిధంగా దేశీయ అవసరాల కోసం వినియోగించే పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతమున్న ఎక్సైజ్ సుంకంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని, దేశీయంగా ఇంధన ధరలు యథాతథంగానే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీనిచ్చింది.






