సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీమంత్రి హరీష్‌రావు కౌంటర్‌

by Ajay Maddhiboyina |

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హ‌రీష్ రావు కౌంట‌ర్ ఇచ్చారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫ‌ల‌మైన రేవంత్ రెడ్డి దాని నుండి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు రైతుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నాడ‌ని అన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీమంత్రి హరీష్‌రావు కౌంటర్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హ‌రీష్ రావు కౌంట‌ర్ ఇచ్చారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫ‌ల‌మైన రేవంత్ రెడ్డి దాని నుండి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు రైతుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నాడ‌ని అన్నారు. రైతు భరోసా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ, రైతుల సమస్యలను పక్కన పెట్టి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమిటి? అని ప్ర‌శ్నించారు. భ‌ట్టి విక్ర‌మార్క‌ రైతుల కోసం రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నాడని అన్నారు. ఇద్దరిలో ఎవరి లెక్కలు నిజం? చేసింది లేదు కాబట్టే ఇష్టం ఉన్నట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. 2027 మార్చి 31 వరకు వ్యవసాయ రంగానికి చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులే సుమారు రూ.82 వేల కోట్లు అయితే, జూన్ 2026 నాటికే లక్షా 56 వేల కోట్లు, లక్షా 75 వేల కోట్లు ఎలా ఖర్చు చేశారు? అని ప్ర‌శ్నించారు. బడ్జెట్‌లో లేని డబ్బును ఖర్చు చేశారా? లేక రైతులను మభ్యపెట్టడానికి కల్పిత లెక్కలు చెబుతున్నారా? అని అడిగారు.

అబద్ధాలను పదిసార్లు చెప్పినా అవి నిజాలు కావు. లేనివి ఉన్నట్లు చెప్పినంత మాత్రాన రైతులు నమ్ముతారా? అని ప్ర‌శ్నించారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఓట్లు అడిగారని, ఇప్పుడు స్వల్పకాలిక రుణాలకే మాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు చెప్ప‌డం రైతుల‌ను మోసం చేయ‌డం కాదా అని అన్నారు. స్వల్పకాలిక రుణాలకే పరిమితం చేస్తామని ముందే చెప్పి ఉంటే రైతులు కాంగ్రెస్‌ను నమ్మేవారా? అని అడిగారు.మేనిఫెస్టోలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిలువెత్తు నిదర్శనమని మండిప‌డ్డారు. ఫేక్ ప్రచారం చేసుకోవడం కాదు.. రైతులకు ఇచ్చిన హామీల అమలు కావాలని అన్నారు. లేనిపక్షంలో రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చ‌రించారు. రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను ఎలా గాలికి వదిలేశారో, అన్నదాతను ఎలా మోసం చేసారో చేర్చేందుకు అసెంబ్లీ మాత్రమే కాదు ఏ వేదికలోనైనా మేము సిద్ధ‌మ‌ని స‌వాల్ చేశారు.

Next Story