ప్రభుత్వ భవనాలను సకాలంలో పూర్తి చేయాలి

by Ratna Kumari |

ప్రభుత్వం చేపడుతున్న భవన నిర్మాణ పనులను నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఎన్. ఖీమ్య నాయక్ మండల అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ భవనాలను సకాలంలో పూర్తి చేయాలి
X

దిశ, రేవల్లి : ప్రభుత్వం చేపడుతున్న భవన నిర్మాణ పనులను నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఎన్. ఖీమ్య నాయక్ మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని తల్పనూర్ గ్రామపంచాయతీని సందర్శించి, గ్రామంలో నిర్మాణంలో ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ (వీఓ) భవన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే, వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, SEEPC సర్వే కింద చేపట్టిన భౌతిక పనులు, గ్రామపంచాయతీ రిజిస్టర్లు, ఎంపీడబ్ల్యూ (ఎంపీడబ్ల్యూ) వేతనాల చెల్లింపు స్థితిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ అధికారులు, ఎంపీఓ నర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Next Story