- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక నటుడిగా ఈ ప్రాజెక్ట్ చేయడం నా అదృష్టం.. ప్రాణం పెట్టి పని చేశా.. నటుడు కామెంట్స్ వైరల్
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’.

దిశ, సినిమా: విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 3న రిలీజ్ కాబోతుండగా.. ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరో విరాట్ కర్ణ ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
‘నేను చేసిన రెండు సినిమాలు (తొలి చిత్రం పెదకాపు, రెండొవ చిత్రం నాగబంధం) భారీ బడ్జెట్ చిత్రాలే. ఓ నటుడిగా అది నా అదృష్టంగా భావిస్తున్నా. ‘పెదకాపు’ కోసం ఒక నటుడిగా 100 శాతం కష్టపడ్డాను. నాగబంధం కోసం నా ప్రాణం పెట్టి కష్టపడ్డా. ఇందులో నా పాత్ర కోసం వినగానే చాలా నచ్చి.. వెంటనే పాత్రకు తగ్గట్టుగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్నాను. హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. డాన్స్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాను. పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. ఇందులో నేను నాగసాధువుగా కనిపిస్తాను. షూటింగ్ సమయంలో ప్రతిరోజూ ఒక శివాలయానికి వెళ్లి అభిషేకం చేసేవాడిని. షూటింగ్ పూర్తయ్యాక శివమాల కూడా ధరించాను. ఆ ప్రయాణంలో ఎన్నో శివాలయాలు సందర్శించాను. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మా డైరెక్టర్ ఇప్పటికే చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా ప్రతీ ఒక్కరికి విజయాన్ని ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.






