మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి అజారుద్దీన్

by Ajay Maddhiboyina |

తెలంగాణలోని మైనారిటీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు.

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి అజారుద్దీన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని మైనారిటీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్ మహమ్మద్ ఒబెదుల్లా కొత్వాల్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సంస్థ 29వ బోర్డు సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీల విద్య, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సహాయ పథకాలపై బోర్డు సుదీర్ఘంగా చర్చించి, పలు కీలక ప్రతిపాదనలకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి బి.షఫీయుల్లా, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ అబ్దుల్ హమీద్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్, బోర్డు సభ్యులు, టీజీఎంఎఫ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story