- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టు కొమ్మ విరిగి మేకల కాపరి మృతి
మహాముత్తారం మండలం కనుకునూరు గ్రామానికి చెందిన ఓ మహిళ మేకలు మేపేందుకు వెళ్లి చెట్టు కొమ్మ విరిగి మీద పడటంతో మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది.

దిశ, మహాముత్తారం : మహాముత్తారం మండలం కనుకునూరు గ్రామానికి చెందిన ఓ మహిళ మేకలు మేపేందుకు వెళ్లి చెట్టు కొమ్మ విరిగి మీద పడటంతో మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనుకునూరు గ్రామానికి చెందిన పోడం సమ్మక్క (39) ప్రతిరోజులాగే సోమవారం కూడా మేకలను మేపేందుకు సమీపంలోని అడవికి వెళ్లింది. మేకలు మేపుతున్న సమయంలో చెట్టు కొమ్మ విరిగి ఆమెపై పడటంతో అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరుకుంది. సాయంత్రం వరకు సమ్మక్క ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అడవిలో వెతకగా, చెట్టు కొమ్మ కింద అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఇంటికి తీసుకువచ్చి స్థానిక వైద్యుడికి చూపించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి సోదరుడు పోడం బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గొర్ల రమేష్ తెలిపారు.






