- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణుగూరు ఏరియాలో 171 శాతం బొగ్గు ఉత్పత్తి....
సింగరేణి మణుగూరు ఏరియాలో జూన్ నెలలో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించమని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ పేర్కొన్నారు.

దిశ, మణుగూరు: సింగరేణి మణుగూరు ఏరియాలో జూన్ నెలలో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించమని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ పేర్కొన్నారు. మంగళవారం జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్పత్తి ఉత్పాదక వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ నెలలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 6 లక్షల 48 వేల 500 టన్నులకు గాను 11 లక్షల 7 వేల 882 టన్నులబొగ్గు ఉత్పత్తి సాధించమన్నారు. 01 ఏప్రిల్, 2026 నుంచి 30 జూన్, 2026 వరకు ప్రోగ్రెస్సివ్ బొగ్గు ఉత్పత్తి 25 లక్షల 62 వేల 500 టన్నుల లక్ష్యానికి గాను 32 లక్షల 40 వేల 75 టన్నులు వెలికి తీశామన్నారు. అంటే 126 శాతం సాధించడం జరిగిందన్నారు. జూన్ నెలలో 11 లక్షల 44 వేల 812 టన్నులను రవాణా చేయటం జరిగిందన్నారు. 01 ఏప్రిల్, 2026 నుంచి 30 జూన్, 2026 వరకు ప్రోగ్రెస్సివ్ గా 33 లక్షల 3 వేల 797 టన్నులు రవాణా చేశామన్నారు. జూన్ నెలలో ఓవర్ బర్డెన్ మన డిపార్ట్ మెంటల్ గా 11 లక్షల క్యూబిక్ మీటర్లకు లక్ష్యానికి గాను 80 % తో 8 లక్షల 84 వేల క్యూబిక్ మీటర్లు తీయడం జరిగిందన్నారు. 01 ఏప్రిల్, 2026 నుంచి 30 జూన్, 2026 వరకు 35 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను 27 లక్షల 50 వేల క్యూబిక్ మీటర్లు తీశామన్నారు. అంటే 79 శాతంగా నమోదైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం డి. వెంకటరామారావు, ఏజిఎం (ఐఈడి) సిహెచ్. రాంబాబు, ఏజిఎం (పర్సనల్) ఎస్. రమేశ్, ఏరియా ఇంజనీర్ మాధార్ నాయక్, ఎమ్ఎన్ జి ఓసి ఈ శ్రీనివాస్, డిజిఎం(సర్వే) ఎల్ దయాకర్, డివై.సిఎంఓ డా. జ్యోతిర్మయి, సీనియర్ ఎస్టేట్స్ అధికారిని కె. స్వప్న, పర్యావరణ అధికారి జె. శ్రీనివాస్ రావు, ఏరియా సెక్యూరిటీ అధికారి కె. శ్రీనివాస్, ఫైనాన్స్ మేనేజర్ పి. రమేశ్, డి.వై. సీఎం బి. శ్యామ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.






