రెబ్బెనలో ప్రత్యేక ఓటరు సర్వేపై ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

by Batti.Sumithra |

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా (ఎస్‌ఐఆర్) సర్వేను జాసింత్ జోయల్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ సూర్యప్రకాశ్ మంగళవారం సమీక్షించారు.

రెబ్బెనలో ప్రత్యేక ఓటరు సర్వేపై ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
X

దిశ, రెబ్బెన : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా (ఎస్‌ఐఆర్) సర్వేను జాసింత్ జోయల్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ సూర్యప్రకాశ్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఎడవెల్లి, నావేగాం, గోలెట్ గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించి సర్వే నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లతో సమావేశమై ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా నింపడం, ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానం, స్టాండర్డ్ ప్రక్రియ పై శిక్షణ ఇచ్చి పలు సూచనలు చేశారు. ప్రతి ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి బీఎల్‌వోకు రెయిన్‌కోట్, పవర్ బ్యాంక్, టీ-షర్ట్, ఫైల్ బ్యాగ్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు సమర్పించిన ఎన్యూమరేషన్ ఫారాలను తహసీల్దార్ కార్యాలయంలో తప్పనిసరిగా స్టాంప్ చేసి భద్రంగా భద్రపరచాలని సూచించారు. సర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ లలిత, బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story