- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బుధవారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు ఏపీ విపత్తు నివారణ విభాగం ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు ఊపందుకోవడంతో రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడతాయని అధికారులు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న వాతావరణ మార్పులపై విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






