- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అటవీశాఖ నూతన అధిపతిగా వినయ్ కుమార్
తెలంగాణ అటవీ శాఖ నూతన ప్రధాన అటవీ సంరక్షణాధికారిగా 1992 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి వినయ్ కుమార్ సోమవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అటవీ శాఖ నూతన ప్రధాన అటవీ సంరక్షణాధికారి(పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్)గా 1992 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి వినయ్ కుమార్ సోమవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన మాజీ పీసీసీఎఫ్ డా. సువర్ణకు అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో డా. సువర్ణ మాట్లాడుతూ, అటవీ శాఖలో సేవలందించే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దాదాపు 35 సంవత్సరాల తన సర్వీసులో వివిధ బాధ్యతలు నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. తన పదవీకాలంలో శాఖ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని, సుమారు 300 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం తనకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
సహకరించిన శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నూతన పీసీసీఎఫ్(హెచ్ఓఎఫ్ఎఫ్) వినయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణలో ఎకో-టూరిజం అభివృద్ధితో పాటు హరిత నిధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. రాష్ట్ర అటవీ సంపద పరిరక్షణ, అభివృద్ధితో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా కార్యాచరణ కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.






