- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా పిల్లల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు.. అందుకే ఎక్స్ అకౌంట్‌ను డిలీట్ చేస్తున్న.. డైరెక్టర్ షాకింగ్ పోస్ట్
ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ఓ పోస్ట్ షేర్ చేశాడు.

దిశ, సినిమా: ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఇటీవల పూణెలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసుపై సినిమా తీయాలంటూ రాహుల్‌కు ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దానిపై రాహుల్.. మన సమాజంలో ఇప్పటికీ పితృస్వామ్య భావజాలం కూడా బలంగానే ఉందంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సమాధానం నచ్చని కొందరు.. రాహుల్‌ను టార్గెట్ చేస్తూ విమర్శల దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆయన భార్య (గాయని చిన్మయి)ని, పిల్లలను చంపేస్తాం అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసి ఎక్స్‌లో షేర్ చేసిన రాహుల్.. ‘ఈ కామెంట్ చూసి నేను అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. పొరపాటున వచ్చిన నోటిఫికేషన్ చూశాను. అందులో నా పిల్లల ప్రాణాలను తీస్తామనే కామెంట్ చదివి నా మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది. నాలో చెప్పలేనంత కోపం, బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. చాలా సమయం తర్వాత నా హృదయ స్పందన నార్మల్ స్థితికి వచ్చింది. క్రీడల సమాచారానికి ఎక్స్ యాప్ ఒక మంచి వేదిక కాబట్టే ఇన్నాళ్లూ నెగెటివిటీ ఉన్నా భరిస్తూ వచ్చాను. కానీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, కుటుంబానికి హాని తలపెట్టేలా ఉన్న ఈ వాతావరణం ఇక చాలు. అందుకే తక్షణమే నా ఫోన్ నుండి ఈ యాప్‌ను తొలగిస్తున్నా. ఇకపై ఎక్స్‌కు దూరంగా ఉంటా’ అంటూ ఓ సుధీర్ఘమైన పోస్టును పంచుకున్నాడు.






