కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. టాటా సియారా ఈవీ విడుదల

by Kema Shiva Kumar |

ఐకానిక్ 'టాటా సియెర్రా' ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో లంచ్ అయింది

కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. టాటా సియారా ఈవీ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఐకానిక్ బ్రాండ్ ‘సియారా’ను సరికొత్త ఎలక్ట్రిక్ ఎడిషన్‌లో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘టాటా సియారా ఈవీ’ (Tata Sierra EV)ని ఇవాళ అధికారికంగా లాంచ్ చేశారు. అయితే, ప్రారంభ ధరను రూ.18.79 లక్షలుగా నిర్ణయించారు. ఈ రోజే బుకింగ్స్ ప్రారంభం కాగా, జూలై 15 నుంచి డెలివరీలు షెడ్యూల్ చేశారు.

పవర్‌ట్రెయిన్, పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ ఇలా..

టాటా సియెర్రా ఈవీ బ్రాండ్ యొక్క ఆల్-వీల్ డ్రైవ్ (QWD) టెక్నాలజీతో వస్తుంది. ఇందులో డ్యూయల్ మోటార్ సెటప్ ఉంది. వెనుక మోటార్ 175 kW సామర్థ్యం, 240 Nm టార్క్, ముందు మోటార్ 103 kW సామర్థ్యం, 164 Nm టార్క్‌గా డిజైన్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ SUV కేవలం 5.8 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. కస్టమర్లకు ఈ కారులో రెండు రకాల హై వోల్టేజ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించారు. 75 kWh బ్యాటరీ ప్యాక్ MIDC క్లెయిమ్ చేసిన రేంజ్ 665 కిమీ కాగా, రియల్ వరల్డ్ రేంజ్ ఒకే చార్జ్‌పై 500 కి.మీ కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 63 kWh బ్యాటరీ ప్యాక్ క్లెయిమ్ చేసిన రేంజ్ ఒకే చార్జ్‌పై 565 కి.మీగా ఉంది. ఈ కారుకు టాటా మోటార్స్ లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీని కూడా ప్రకటించడం విశేషం.

Next Story