- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : ఎస్పీ
by Taduka Kalyani |
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (జులై 1వ తేదీ నుంచి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

X
దిశ, కామారెడ్డి: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (జులై 1వ తేదీ నుంచి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story






