వారెవ్వా.. పోలీసులకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Kema Shiva Kumar |

తెలంగాణలో పోలీసులకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వారెవ్వా.. పోలీసులకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్లపై వెళ్లే వాహనదారులకు డైలీ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ((Drunk and Drive Tests) నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, విధుల్లో చేరే ముందు పోలీసులకే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన వినూత్న ఘటన తెలంగాణలో వెలుగుచూసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తెలంగాణలోని ఓ పోలీస్ స్టేషన్‌లో రాత్రి వేళ పెట్రోలింగ్ డ్యూటీకి (Night Patrol) వెళ్లేందుకు కానిస్టేబుళ్లు సిద్ధమయ్యారు. అయితే వారు విధుల్లోకి వెళ్లే ముందు ఆ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) కానిస్టేబుళ్లకు బ్రీత్ అనలైజర్‌తో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుళ్లు మద్యం సేవించి డ్యూటీకి హాజరయ్యారా అని పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్న తర్వాతే వారిని పెట్రోలింగ్‌కు అనుమతించారు.

ప్రజల నుంచి ప్రశంసలు..

అయితే, పోలీస్ శాఖలో విధుల పట్ల పారదర్శకత, క్రమశిక్షణను పెంపొందించేందుకు సదరు ఎస్ఐ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యపై నెటిజన్లు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసులు మరింత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా పని చేసేందుకు ఇలాంటి తనిఖీలు ఎంతో దోహదపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story