ఉద్దవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ.. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి సచిన్ అహిర్ నామినేషన్

by I. Sairam |

శివసేన (యూబీటీ) కీలక నేత, ఎమ్మెల్సీ సచిన్ అహిర్ రాజీనామా చేశారు. ఇప్పటికే ఆరుగురు ఎంపీల రాజీనామాతో కుదేలైన ఉద్దవ్ ఠాక్రేకు ఈ పరిణామం మరింత ఇబ్బందిని కలిగించింది.

ఉద్దవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ.. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి  సచిన్ అహిర్ నామినేషన్
X

దిశ, నేషనల్ బ్యూరో : శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రేకు మరు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ సచిన్ అహిర్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేశారు. వెంటనే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి మహాయుతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ షిండే, సునేత్రా పవార్‌ల సమక్షంలో ఆయన తన నామినేషన్‌ను సమర్పించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు రాజీనామా చేసి షిండే వర్గంలో చేరిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా.. ఉద్ధవ్ ఠాక్రే, ఆధిత్య ఠాక్రేలకు అత్యంత ఆప్తుడిగా భావించే సచిన్ అహిర్ కూడా రాజీనామా యూబీటీ వర్గాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ పరిణామంపై ఆధిత్య ఠాక్రే స్పందిస్తూ.. పార్టీ ఆయనకు ఇవ్వనిది ఏముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి తరఫున ఈ డిప్యూటీ చైర్మన్ పదవికి జగన్నాథ్ అభ్యంకర్ పోటీ చేస్తారని యూబీటీ నేత అంబాదాస్ దాన్వే వెల్లడించారు.

Next Story