కాలువ పనుల్లో ట్యాంకర్ ఢీకొని మహిళ కూలి మృతి...

by Taduka Kalyani |

అనంతగిరి మండలంలోని గోల్‌తండా గ్రామంలో ఎన్‌ఎస్‌పీ కాలువ మరమ్మతు పనుల సందర్భంగా జరిగిన ప్రమాదంలో మహిళ కూలి మృతి చెందింది.

కాలువ పనుల్లో ట్యాంకర్ ఢీకొని మహిళ కూలి మృతి...
X

దిశ, అనంతగిరి : అనంతగిరి మండలంలోని గోల్‌తండా గ్రామంలో ఎన్‌ఎస్‌పీ కాలువ మరమ్మతు పనుల సందర్భంగా జరిగిన ప్రమాదంలో మహిళ కూలి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం కాలువపై కంకర వేస్తున్న సమయంలో ట్యాంకర్ వెనక్కి వస్తుండగా మహారాష్ట్రకు చెందిన వలస కూలి సురేఖపైకి ప్రమాదవశాత్తు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమెను తోటి కార్మికులు చికిత్స కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త లక్ష్మణ్‌తో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ..తల్లి మృతి చెందిన విషయం చిన్నారులకు ఇంకా తెలియకపోగా, భార్యను కోల్పోయిన లక్ష్మణ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ ఘటనతో కాలువ పనుల వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story