- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివాలయంలో చోరీ..బంగారు, వెండి వస్తువులు అపహరణ
by Taduka Kalyani |
మండలంలోని హజారి గూడెం శివాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆలయంలో పలు వస్తువులను అపహరించారు.

X
దిశ, హాలియా : మండలంలోని హజారి గూడెం శివాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆలయంలో పలు వస్తువులను అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు ఆలయంలో అమ్మవారికి చెందిన తులం బంగారు పుస్తెలు, సుమారు 750 గ్రాముల పలు వెండి వస్తువులు అపహరించినట్లు తెలిపారు. ఈ విషయమై మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నల్లగొండ నుండి క్లూస్ టీం సభ్యులు వచ్చి శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. ఆలయ పరిసరాలతో పాటు హజారి గూడెం ప్రధాన రహదారిపై సీసీ కెమెరాలు పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేసినట్లు హాలియా ఎస్సై బండి సాయి ప్రశాంత్ తెలిపారు.
Next Story






