- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్‌ను ఉపయోగించుకోవాలి : ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన పథకం అని, అర్హులైన ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్‌ను ఉపయోగించుకోవాలని ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు.

దిశ, రాంనగర్ : ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన పథకం అని, అర్హులైన ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్‌ను ఉపయోగించుకోవాలని ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు లక్షా 70 వేల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యం, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులు భరించలేని అర్హులైన ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్‌ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
అవసరమైన పత్రాలతో ప్రజలు ముషీరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తే, దరఖాస్తులను త్వరితగతిన సంబంధిత అధికారులకు పంపించి సహాయం అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, వై. శ్రీనివాస్, శంకర్ ముదిరాజ్, మీడియా ఇన్‌చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, నాయకులు సాయి కృష్ణ, బింగి నవీన్, మహమ్మద్ అలీ, ముదిగొండ మురళి, శంకర్ గౌడ్, శ్రీహరి, లబ్ధిదారులు పాల్గొన్నారు.






