నిరుద్యోగులకు మహిళా రైతు జాబ్ ఆఫర్.. రోజుకు 8 గంటలు పని, 12వేల జీతం

by Ajay Maddhiboyina |

ప్రస్తుతం యావత్ దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఉద్యోగాలు దొరక్క యువత ఖాళీగా ఉంటున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక ఉద్యోగానికి వేల మంది పోటీ ఉంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితి కూడా అలేగే ఉంది.

నిరుద్యోగులకు మహిళా రైతు జాబ్ ఆఫర్.. రోజుకు 8 గంటలు పని, 12వేల జీతం
X

దిశ, వెడ్ డెస్క్: ప్రస్తుతం యావత్ దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఉద్యోగాలు దొరక్క యువత ఖాళీగా ఉంటున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక ఉద్యోగానికి వేల మంది పోటీ ఉంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితి కూడా అలేగే ఉంది. మరోవైపు ఏఐ ప్రభావం సైతం ఉద్యోగాలపై గట్టిగానే పడింది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ రాకతో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. దీంతో ఎన్ని డిగ్రీలు, పీజీలు ఉన్నా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఓ రైతు తాను ఉద్యోగం ఇస్తానని ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. ఏఐ వచ్చినా ఇంకేమైనా వచ్చినా.. కష్టం చేసేవాళ్లకు అవకాశాలకు కొదువ ఉండదని నిరూపితమైంది.

అసలు విషయానికి వస్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు జాబ్ ఆఫర్ చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ చేయాల్సి ఉంటుందని, నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటామని తెలిపింది. ప్రతినెల రూ.12వేలు జీతంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని ప్రకటించింది. చేయాల్సిన పని.. టమాటా మొక్కలను నాటడం, అవి పడిపోకుండా చూసుకోవడమని తెలిపింది.

ప్రతి రోజు టమాటాలు కూడా కోయాలని ట్రైనింగ్ తరవాత ఉద్యోగంలోకి తీసుకుంటామని చెప్పింది. పొద్దున టీ, బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఇంటికి వెళ్లేటప్పుడు కూరగాలు సైతం తీసుకుని వెళ్లవచ్చని చెప్పింది. ప్రస్తుతం మహిళా రైతు జాబ్ ఆఫర్ వీడియో వైరల్ అవుతోంది. దీంతో కంప్యూటర్ల మధ్య ప్రెషర్ తో బతికే ఈ కంప్యూటర్ ఉద్యోగాల కంటే పచ్చని తోటలో హాయిగా పనిచేసుకోవడమే బెటర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగంలో చేరేందుకు తాము రెడీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story