విజయవాడ బైపాస్‌పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

by Ajay Maddhiboyina |

విజయవాడ కొత్త బైపాస్ రోడ్డుపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి ఏలూరు వైపు వెళుతున్న కంటైనర్ లారీ పంక్చరై అదుపుతప్పి ముందు వెలుతున్న కారును ఢీ కొట్టింది. కారు దాని మందున్న ఆయిల్ ట్యాంకర్ ను, అది దాని ముందున్న బైక్ ను ఢీ కొట్టాయి.

విజయవాడ బైపాస్‌పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కొత్త బైపాస్ రోడ్డుపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి ఏలూరు వైపు వెళుతున్న కంటైనర్ లారీ పంక్చరై అదుపుతప్పి ముందు వెలుతున్న కారును ఢీ కొట్టింది. కారు దాని మందున్న ఆయిల్ ట్యాంకర్ ను, అది దాని ముందున్న బైక్ ను ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు, బైక్ పై వెళుతున్న ఒకరు మృతి చెందారు. స‌మాచారం అందిన వెంట‌నే గ‌న్న‌వ‌రం పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. కారులో మృతి చెందిన వారిని కైక‌లూరు మండ‌టం పెంచిక‌ల‌మ‌ర్రుకు చెందిన త‌ల్లి జ‌య‌మంగ‌ళ నాగ‌దుర్గ 28, ఆమె కుమారుడు నాగ‌సాయి 3 గా గుర్తించారు. ప్ర‌మాదంలో భ‌ర్త విజ‌య్ కుమార్ కు సైతం గాయాలు అయ్యాయి. బైక్ వెళుతున్న‌వారిలో దాస‌రి వెంక‌టేశ్వ‌ర‌రావు 50 మ‌ర‌ణించారు. ఈ ప్ర‌మాదంలో రెండు లారీల మ‌ధ్య ఇరుక్కుని కారు నుజ్జు నుజ్జు అయ్యింది. మృత‌దేహాల‌ను గ‌న్న‌వ‌రం ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Next Story