- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసీఎఫ్ పాఠశాలను ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’గా మార్చాలి
మంచాల మండలం ఆంగోత్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఐసీఎఫ్ (ఇంటర్ కల్చరల్ కోఆపరేషన్ & ఫౌండేషన్) పాఠశాలను 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'గా మార్చాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

దిశ, మంచాల : మంచాల మండలం ఆంగోత్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఐసీఎఫ్ (ఇంటర్ కల్చరల్ కోఆపరేషన్ & ఫౌండేషన్) పాఠశాలను 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'గా మార్చాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి వినతిపత్రం అందజేశారు. గత 22 ఏళ్లుగా ఈ పాఠశాల స్థానిక విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తూ వస్తోందని నాయకులు పేర్కొన్నారు. గతంలో ఈ పాఠశాలను హథీ ఫౌండేషన్ నిర్వహించేదని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వారు నిర్వహించలేక ఒక ప్రైవేట్ ట్రస్ట్‌కు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. సదరు ప్రైవేట్ యాజమాన్యం విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుండటంతో స్థానిక పేద విద్యార్థుల విద్యకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని, తక్షణమే ప్రభుత్వం ఈ పాఠశాలను తన ఆధీనంలోకి తీసుకుని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చాలని కోరారు. ఈ సమస్య పై స్పందించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, పాఠశాలను ప్రభుత్వ పబ్లిక్ స్కూల్‌గా మార్చేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి డాక్టర్ ఎ. బాలకోటి నాయక్, గ్రామ కాంగ్రెస్ నాయకులు కుమార్ నాయక్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్. రాజేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి ఎస్. మోహన కృష్ణ, పవన్, గ్రామయువత తదితరులు పాల్గొన్నారు.






