- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలులో అక్రమంగా తరలిస్తున్న రూ.5.80 లక్షల విలువైన ఎండు గంజాయి పట్టివేత
రైలులో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని కామారెడ్డి రైల్వే స్టేషన్ లో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

దిశ, కామారెడ్డి : రైలులో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని కామారెడ్డి రైల్వే స్టేషన్ లో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సంబల్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో భారీగా ఎండు గంజాయి బయటపడింది. పక్కా సమాచారంతో కామారెడ్డి ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద నుంచి రూ.5 లక్షల 80 లక్షల విలువైన 10.9 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన అశోక్ కుమార్ మిశ్రా, మహారాష్ట్రకు చెందిన గణేష్ పండిత్‌గా గుర్తించారు. ఒడిశా రాష్ట్రం రాయ్‌ఘడ్ నుంచి నాందేడ్‌కు అక్రమంగా తరలిస్తుండగా వారిని పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, ట్రైనీ ఎక్సైజ్ సూపరిండెంట్ అరుణ్ చంద్ర, ఎస్సై శ్రీనివాస్, రావు, ఆర్పిఎఫ్ ఎస్సై తో పాటు సిబ్బంది ఫరీద్, హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ మునవర్ ఘోరీ, రాజు, పవన్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.






