- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇథనాల్ బ్లెండింగ్ పాలసీకి ఊరట.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ‘స్టేటస్ కో’
ఇథనాల్ పంపిణీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఇథనాల్ పంపిణీకి సంబంధించిన వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025–26 సరఫరా సంవత్సరానికి గాను ఇథనాల్ పంపిణీని రివ్యూ చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టేటస్ కో (Status Quo) విధించింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీపీసీఎల్..
కర్ణాటక హైకోర్టు జూన్ 2026లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2025–26 సంవత్సరానికి తమకు ఇథనాల్ కేటాయింపులను పెంచాలంటూ ఓ డిస్టిలరీ సమర్పించిన వినతిని పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను నాటి హైకోర్టు ధర్మాసనం ఆదేశించగా.. దానిపై బీపీసీఎల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల వల్ల దేశవ్యాప్తంగా అమలువుతున్న ఇథనాల్ బ్లెండింగ్ విధానం దెబ్బతినే ప్రమాదం ఉందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి కోర్టుకు విన్నవించారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలనే కేంద్ర ప్రభుత్వ జాతీయ విధానాన్ని ఆ తీర్పు అస్థిరపరుస్తుందని వాదించారు. కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం అటార్నీ జనరల్ వాదనలను పరిగణనలోకి తీసుకు కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులపై స్టేటస్ కో విధిస్తున్నట్లుగా ప్రకటించింది.






