- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన మహిళకు జరిమానా
మంథని మండలం మైదుపల్లి గ్రామానికి చెందిన గుండా లక్ష్మి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.25 వేల జరిమానా విధించినట్లు మంథని అబ్కారీ సీఐ రాకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, మంథని : మంథని మండలం మైదుపల్లి గ్రామానికి చెందిన గుండా లక్ష్మి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.25 వేల జరిమానా విధించినట్లు మంథని అబ్కారీ సీఐ రాకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో చట్టవిరుద్ధంగా నాటు సారా విక్రయించిన కేసులో ఆమెను మంథని తహసీల్దార్ ఎదుట ఒక లక్ష రూపాయల పూచీకత్తుతో ఏడాది పాటు బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ నెల 22న మళ్లీ చట్టవిరుద్ధంగా నాటు సారా విక్రయిస్తుండగా పట్టుబడటంతో ఆమెపై మరో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మంథని మండల పరిధిలో ఎవరైనా చట్టవిరుద్ధంగా నాటు సారా తయారీ, విక్రయం, రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అబ్కారీ సీఐ హెచ్చరించారు. నాటు సారా అక్రమాలపై సమాచారం ఉన్న వారు 8712658820 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. మంథని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రాకేష్ కుమార్, ఎస్‌ఐ సాయికుమార్‌తో పాటు సిబ్బంది ఈ చర్యల్లో పాల్గొన్నారు.






