గోధుమ వాగు బ్రిడ్జి పై గుంతలకు మరమ్మతులు : మేయర్

by Taduka Kalyani |   (  Updated:2026-06-30 11:40:02  IST  )

పట్టణ పరిధిలోని రామవరం గోధుమ వాగు బ్రిడ్జి పై ఏర్పడిన గుంతలకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మరమ్మతు పనులను చేపట్టారు.

గోధుమ వాగు బ్రిడ్జి పై గుంతలకు మరమ్మతులు : మేయర్
X

దిశ, కొత్తగూడెం టౌన్: పట్టణ పరిధిలోని రామవరం గోధుమ వాగు బ్రిడ్జి పై ఏర్పడిన గుంతలకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మరమ్మతు పనులను చేపట్టారు. కొత్తగూడెం పరిధిలోని రామవరం గోధుమ వాగు బ్రిడ్జి పై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం తో పాటు తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం తో మున్సిపల్ శాఖ ఈ మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టింది. మరమ్మతు పనులను కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ మంగళవారం పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జీపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడి నిత్యం ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్న నేషనల్ హైవే అధికారులు ఘోరంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమ భాధ్యతను విస్మరించారని ఆరోపించారు. ఏండ్ల తరబడి ఈ దుస్థితి నెలకొనడం వల్లే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన ఈ మరమ్మతు పనులు చేపట్టామని స్పష్టం చేశారు. వాహనదారులకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేయాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. మేయర్ వెంట కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, కూరపాటి సుధాకర్, జి వెంకటేశ్వర్లు, నాయకులు ఎండీ యూసుఫ్, ధర్మరాజు, పి సత్యనారాయణ చారి, తదితరులు ఉన్నారు.

Next Story