- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ పాలిటిక్స్‌లో మరో సెన్సేషన్.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvad Srinivas) కనిపించకుండా పోవడం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan)పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణ ఎదుర్కొనేందుకు కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన ఆయన మార్గమధ్యంలోనే కనిపించకుండాపోవడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
ఇప్పటికే ఒకసారి విచారణకు..
అయితే, గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియా (Social Media) వేదికగా దువ్వాడ శ్రీనివాస్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై గొట్ట గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పి.చిన్నారావు హిరమండలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కొత్తూరు పీఎస్‌లో విచారణకు హాజరుకావాలని సీఐ సీహెచ్ ప్రసాదరావు (CH Prasada) ఇప్పటికే దువ్వాడకు నోటీసులు ఇవ్వగా ఈ నెల 22న ఆయన విచారణకు హాజరయ్యారు. రెండు గంటల పాటు విచారించిన అధికారులు దువ్వాడను సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
కాగా, పోలీసుల ఆదేశాల ప్రకారం ఇవాళ మధ్యాహ్నం కొత్తూరు పీఎస్‌లో విచారణకు హాజరయ్యేందుకు దువ్వాడ శ్రీనివాస్ బయలుదేరారు. కానీ, ఆయన స్టేషన్‌కు చేరుకోకుండానే మధ్యలోనే మాయమవడం సంచలనంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ కనిపించకుండా పోవడంతో ఆయన అనుచరురాలు దివ్వెల మాధురి (Divvela Madhuri), ఇతర అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే దువ్వాడ శ్రీనివాస్‌ను దారిలోనే అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతానికి తరలించారని మాధురి ఆరోపించారు. మరోవైపు దివ్వెల మధురి వ్యాఖ్యలపై కొత్తూరు పోలీసులు స్పందించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను తాము అరెస్ట్ చేయలేదని, ఆయన అదృశ్యానికి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నోటీసుల ప్రకారం ఆయన విచారణకు రావాల్సి ఉందని, కానీ రాలేదని పేర్కొన్నారు.






