రాజస్థాన్ జైపూర్‌లో మరో పరీక్ష కుంభకోణం

by Ajay Maddhiboyina |

రాజస్థాన్ జైపూర్‌లో మరో పరీక్ష కుంభకోణం బయటపడింది. పారామెడికల్ డిప్లమా పరీక్షల్లో కాపీయింగ్‌కు ఓ ముఠా పక్కా పథకం రచించింది. ఇన్విజిలేటర్ల సహాయంతో విద్యార్థులను పాస్ చేయించే ప్రయత్నం చేసింది.

రాజస్థాన్ జైపూర్‌లో మరో పరీక్ష కుంభకోణం
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ జైపూర్‌లో మరో పరీక్ష కుంభకోణం బయటపడింది. పారామెడికల్ డిప్లమా పరీక్షల్లో కాపీయింగ్‌కు ఓ ముఠా పక్కా పథకం రచించింది. ఇన్విజిలేటర్ల సహాయంతో విద్యార్థులను పాస్ చేయించే ప్రయత్నం చేసింది. అయితే పరీక్ష ప్రారంభానికి ముందే పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి కుట్రను భగ్నం చేశారు. ఈ కుట్రకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాలేజీ అడ్మినిస్ట్రేటర్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు. పరీక్షల్లో పాస్ చేయించేందుకు విద్యార్థుల దగ్గర ఈ ముఠా లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మాస్ కాపీయింగ్ సమాచారం బయటపడటంతో విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోయారు.

కాలేజీపై అంతస్థుల నుండి కుర్చీలు, పేపర్లు విసురుతూ ఆందోళన చేశారు. ఇటీవల నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్నం కూడా రాజస్థాన్ నుండే లీక్ అయ్యిన సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్ లీకేజీతో చాలా మంది విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనం అయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో కేంద్రమంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపించాయి.. వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఆయన మాత్రం తన పదవిలో కొనసాగూనే ఉన్నారు.

Next Story