- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడాలి నానికి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. కొడాలి నానిపై ప్రభుత్వం అనుమతించిన ప్రాసిక్యూషన్ పై స్టే విధించింది. నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 2021 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. కొడాలి నానిపై ప్రభుత్వం అనుమతించిన ప్రాసిక్యూషన్ పై స్టే విధించింది. నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 2021 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లగించారని నాడు కృష్ణా జిల్లా ఎస్పీకి ఎన్నికల సంఘం నివేదిక ఇచ్చింది. ఈసీ ఆదేశాలతో 2021 ఫిబ్రవరిలో 16న నానిపై కేసు నమోదు చేశారు.
దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. దీంతో కొడాలికి భారీ ఊరట లభించింది. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ప్రతిపక్షాలపై చేసే విమర్శలు తారా స్థాయికి చేరాయి. ప్రతిపక్షనాయకుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం ఆయనకు మైనస్ అయ్యింది. తరవాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగానూ ఓటమిపాలయ్యారు. వైసీపీ ఓటమి తరవాత అనారోగ్య సమస్యల కారణంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పెద్దగా కనిపించలేదు. ఇటీవలే కోలుకుని తిరిగి యాక్టివ్ అవుతున్నారు.






