- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు
ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పేర్కొన్నారు.

దిశ, గోదావరిఖని : ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం 21వ డివిజన్‌లో నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో కీలకమైందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు) నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియపై వివరాలు తెలుసుకుని, అధికారులు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ప్రజలు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. అధికారులు ఇంటింటికీ వచ్చినప్పుడు అవసరమైన పత్రాలు, వివరాలు అందించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్, పార్టీ నాయకులు, బూత్ లెవల్ అధికారులు (BLOలు), కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






