- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్వపల్లి పీహెచ్‌సీలో అద్భుతం.. 4.4 కిలోల బరువుతో శిశువు జననం
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య బృందం ఓ గర్భిణీ మహిళకు అరుదైన పురుడు పోశారు.

దిశ, అర్వపల్లి(జాజిరెడ్డిగూడెం): సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య బృందం ఓ గర్భిణీ మహిళకు అరుదైన పురుడు పోశారు. 4.4 కేజీల బరువున్న శిశువును చూసిన వారంతా బాల భీముడిగా వర్ణించడం కొసమెరుపు. ఇంతటి అసాధారణ కాన్పును కూడా సాధారణ ప్రసవం చేసి ప్రభుత్వ వైద్యం పై ప్రజలకు భరోసా కల్పించారు. డాక్టర్ నగేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొమ్మాల గ్రామానికి చెందిన గర్భిణి గంగాధరి శిరీష పురిటి నొప్పులతో సోమవారం రాత్రి పీహెచ్ సీలో చేరారని తెలిపారు.
వైద్య సిబ్బంది పరీక్షించి అర్ధరాత్రి తర్వాత సాధారణ సుఖ ప్రసవం చేయగా 4.4 కిలోల బరువుతో పండంటి మగ శిశువు జన్మించాడని అన్నారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని తెలిపారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల అపోహలను వీడి నాణ్యమైన వైద్య సేవలను పొంది, సిజేరియన్లకు అవకాశం ఇవ్వకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ డెలివరీలో నర్సింగ్ ఆఫీసర్లు బోడ సునీత, మాధవి, ఆశా కార్యకర్త రోజా, ఆయా శైలజ పాల్గొన్నారు.






