హీరోయిన్ల విషయంలోనూ దర్శకనిర్మాతలు నమ్మకం చూపించాలి: Samantha

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-30 07:43:04  IST  )

పని వేళలు,మెరుగైన పారితోషికం కోసం ఇప్పటికీ హీరోయిన్లు పోరాడాల్సి వస్తోంది. ఇది ఒక రోజులో మారేది కాదు. మగ సూపర్ స్టార్లు ఒక్క రోజులో పుట్టరు.

హీరోయిన్ల విషయంలోనూ దర్శకనిర్మాతలు నమ్మకం చూపించాలి: Samantha
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్‌లోకి రాగా.. మొదటి షో నుంచి భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటుగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. థియేటర్స్‌లో దూసుకుపోతూ.. పలు రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’తో సామ్ కంబ్యాక్ ఊహించని స్థాయికి చేరుకుందని చెప్పాలి. కానీ అంతలోనే ఆమె మళ్లీ ఒక బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులను నిరాశ పరిచారు. సామ్ తల్లి కాబోతుండటంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్ అయినా.. వర్కింగ్ అవర్స్, రెమ్యునరేషన్ విషయాల్లో వివక్ష ఎందుకుంటుంది? అనే విషయంపై సమంత స్పందిస్తూ.. "పని వేళలు,మెరుగైన పారితోషికం కోసం ఇప్పటికీ హీరోయిన్లు పోరాడాల్సి వస్తోంది. ఇది ఒక రోజులో మారేది కాదు. మగ సూపర్ స్టార్లు ఒక్క రోజులో పుట్టరు.

వారిని దేవుడిలా చూపించడానికి దర్శకులు, నిర్మాతలు ఎంతో సమయం, శ్రమ పెడతారు. ప్రతి సినిమాతో వారి ఇమేజ్‌ను బిల్డ్ చేస్తారు. కానీ, దురదృష్టవశాత్తు మహిళా నటీమణుల విషయంలో ఆ శ్రమ, సమయం కేటాయించరు. మేకర్స్ హీరోయిన్లను కూడా సూపర్ స్టార్లుగా మార్చడానికి అంతే టైమ్, ఇన్వెస్ట్‌మెంట్ పెడితే.. అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. హీరోయిన్ల విషయంలోనూ ఆ నమ్మకం చూపించాలి " అని సమంత అభిప్రాయపడ్డారు. అలాగే సోషల్ మీడియా నెగిటివిటీ గురించి చెబుతూ.. "ఈ రోజుల్లో మన చుట్టూ ఉండే జనాలు, సోషల్ మీడియా కామెంట్స్ మన నిర్ణయాలను మార్చేస్తున్నాయి. దీనివల్ల మన మనసులో ఏముందో, మనకు ఏం కావాలో బయటకు చెప్పలేకపోతున్నాం. పక్కవారి అభిప్రాయాలను, వారి ఆలోచనలను మనవిగా నమ్మే ప్రమాదం ఉంది. అందుకే నేను ఈ గొడవలకు దూరంగా ఉండటానికి మెడిటేషన్ , ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లడం చేస్తుంటాను. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది చాలా అవసరం" అని సమంత చెప్పుకొచ్చారు.

Next Story