- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఇంటింటి సర్వేను బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఇంటింటి సర్వేను బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం గద్వాల పట్టణ పరిధిలోని 21వ వార్డులోని 233, 234 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బీఎల్ఓలు ప్రతిరోజూ తమ పరిధిలోని ఇంటింటికి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకుని, నిర్దేశిత గడువులోగా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఎన్యుమరేషన్ ఫారాన్ని స్కాన్ చేసిన తర్వాతే ఓటర్లకు అందజేయాలని ఆదేశించారు. ఎన్యుమరేషన్ ఫారాలను పూరించడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), స్థానిక యువత ఓటర్లకు సహకరించాలని కోరారు. ఓటర్లు కూడా అవసరమైన వివరాలను సమర్పించి సర్వే ప్రక్రియ విజయవంతం కావడానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు ఇండ్లను సందర్శించి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను స్వయంగా అందజేశారు. ఈ పర్యటనలో స్థానిక కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్, గద్వాల తహసీల్దార్ హరికృష్ణ, సూపర్వైజర్ వెంకటేశ్వర్ రెడ్డి, బీఎల్ఓ శాంతమ్మ, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.






