ఫిక్షన్ నుంచి వాస్తవానికి.. ఒకప్పటి ఊహలే నేటి సాంకేతికత!

by Javid Pasha |   (  Updated:2026-06-30 10:26:21  IST  )

ఒకప్పుడు సాధ్యం కాదేమో అనుకున్న ఊహాజనిత సాంకేతికతల్లో కొన్ని ఇప్పటికే వాస్తవంలోకి వచ్చాయి.

ఫిక్షన్ నుంచి వాస్తవానికి.. ఒకప్పటి ఊహలే నేటి సాంకేతికత!
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా ఒక విషయంలో చర్చ వచ్చినప్పుడు అప్పటి పరిస్థితిని బట్టి అసాధ్యం అనిపించవచ్చు. అందరూ అదే నిజమని భావించవచ్చు. కానీ ఆ పరిస్థితులు, ఆ భావనలు ఎప్పటికీ స్థిరంగా ఉండకపోవచ్చునని మీకు తెలుసా? ఎందుకంటే.. ఆధునిక సాంకేతిక పరిణామాల విషయంలో అదే జరుగుతోంది. ఒకప్పటి ఎవరూ ఊహించని విధంగా, ఇది సాధ్యం కాదని అనుకున్నవి సైతం ఇప్పుడు సాధ్యం అవుతున్నాయి. ఇంతకీ సాంకేతికతలు ఏవి? వాటివల్ల మానవులు పొందుతున్న సౌకర్యాలేమిటో సంక్షిప్తంగా తెలుసుకుందాం.

ఫిక్షన్ నుంచి వాస్తవం వరకు..

యెస్.. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన టెక్నాలజీ ఇప్పుడు ల్యాబులు, హాస్పిటల్స్, ఫ్యాక్టరీలు, రోజువారీ పరికరాల్లో నిజం అవుతున్నాయి. ముఖ్యంగా 1. బ్రెయిన్ ఇంప్లాంట్స్ (మెదడులో చిప్పులు), 2. లైవ్ ట్రాన్స్‌లేషన్ ఇయర్‌బడ్స్ (నిజ సమయంలో భాషా అనువాదం), 3. CRISPR జన్యు ఎడిటింగ్, 4. ల్యాబ్ గ్రొన్ మీట్ (ప్రయోగశాలలో పండించిన మాంసం), 5. రోబోటిక్ ఎక్సోస్కెలెటన్స్ (రోబోట్ బాహ్య అస్థిపంజరాలు), 6. 3D ప్రింటెడ్ శరీర భాగాలు, 7. పంది అవయవాల ట్రాన్స్‌ప్లాంట్స్, 8. లివింగ్ సెల్ రోబోట్స్ (జీవ కణాలతో తయారైన రోబోట్లు), 9. హ్యూమనాయిడ్ రోబోట్స్ (మానవ ఆకారపు యంత్రాలు) వంటివి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని టెస్టింగ్ దశలో ఉంటే మరికొన్ని ఆమోద దశలో లేదా వాస్తవ ఉపయోగంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

వేగం.. సౌకర్యం..

ఒకప్పుడు సాధ్యం కాదేమో అనుకున్న ఊహాజనిత సాంకేతికతల్లో కూడా కొన్ని ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇంకా పరిశోధనా దశల్లో కూడా ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఇవన్నీ వైద్యం, ఆహారం, సంభాషణ, రవాణా, పని వంటి రంగాలను వేగంగా, మరింత సౌకర్యంగా మార్చేస్తున్నాయి. ప్రధానంగా బ్రెయిన్ ఇంప్లాంట్స్ పక్షవాతం రోగులు కేవలం ఆలోచనతోనే కంప్యూటర్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతున్నాయి. CRISPR జన్యు ఎడిటింగ్ అనేది జన్యు వ్యాధులను నయం చేసే సామర్థ్యం చూపుతోంది. ల్యాబ్ గ్రొన్ మీట్, 3D ప్రింటెడ్ అవయవాలు భవిష్యత్ ఆహారం, అవయవ లోపాలకు పరిష్కారాలుగా మారుతున్నాయి. మొత్తానికి ఈ సాంకేతికతలు ఒకప్పటి మన ఊహలను నేడు నిజం చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించాల్సి ఉన్నప్పటికీ కాలంతోపాటు టెక్నాలజీ ఎంత వేగంగా ముందుకు వెళ్తోందో ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.

Next Story