- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తడి బట్టలతో భద్రకాళి అమ్మవారి ముందు ప్రమాణానికి సిద్ధం... మీరు సిద్ధమా..?
కూడా వేలంలో అవినీతి అక్రమాలు జరిగాయని తాము తడి బట్టలతో భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా వేలంలో ఎలాంటి అవినీతి జరగకపోతే కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిలు భద్రకాళి గుడికి తడి బట్టలతో రావడానికి సిద్ధమా అని ప్రశ్నించారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : కూడా వేలంలో అవినీతి అక్రమాలు జరిగాయని తాము తడి బట్టలతో భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా వేలంలో ఎలాంటి అవినీతి జరగకపోతే కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిలు భద్రకాళి గుడికి తడి బట్టలతో రావడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. మంగళవారం హనుమకొండలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి మర్రి యాదవ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జూన్ 21న కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ బాలసముద్రంలోని 2 ఎకరాల 27 గుంటల స్థలాన్ని వేలం వేసింది. ఆ స్థలం వేలంలో విషయంలో బీఆర్ఎస్ పార్టీగా తము వేలంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేశాం. కుడాకు 50 కోట్ల నష్టం జరిగిందని, బహిరంగ మార్కెట్‌లో 1,50,000 గజం స్థలాన్ని కేవలం 66 వేలు, 67 వేలు, 69 వేలకు వేలం వేయడం వెనక సిండికేట్ ఉందని విమర్శలు చేశాం.కుడా వేలంలో అవినీతి జరిగిందని మేము మీడియా ముఖంగా మాట్లాడాం కానీ బాధ్యతగల పదవిలో ఉన్న వారు వేలం మీద మాట్లాడకుండా తమపై చిల్లర మాటలు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పై అవాక్కులు చివాక్కులు పేలుతున్నారు అన్నారు. దమ్ముంటే, మీరు అవినీతి చేయకపోతే సవాల్ విసురుతున్న ఈ శుక్రవారం ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి గుడికి రండి... అవినీతి జరిగిందని, తడి బట్టల స్నానం చేసి అమ్మవారి మీద ప్రమాణం చేస్తాను. మీరు అవినీతి చేయకపోతే తడిబట్టల స్నానం చేసి అమ్మవారి మీద ప్రమాణం చేయండి... నిజాయితీ పరులైతే తమ సవాల్‌ను స్వీకరించాలి. మళ్లీ తమ పై విమర్శలు కాకుండా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కమిషన్ మాజీ సభ్యులు దర్శన్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, సీనియర్ నాయకులు నార్లగిరి రమేష్, నయీమొద్దీన్, రామ్మూర్తి, రమేష్, కృష్ణ, వేణు, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేష్, ఉడతల సారంగపాణి, మేకల బాబు రావు, సోదా కిరణ్, సంకు నర్సింగ రావు, నాయకులు పుష్ప, సదాంత్, రాంచందర్, శేఖర్, ఖలీల్, ఇస్మాయిల్, రాజేష్, తక్కళ్లపల్లి వినీల్ రావు, శ్యామ్ రెడ్డి, డా. కంజర్ల మనోజ్ కుమార్, భైరపాక ప్రశాంత్, ఫెరోజ్, ఎస్కే మహమూద్, గౌస్ ఖాన్, కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.






