- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు
ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.

దిశ, పిట్లం :(నిజాంసాగర్) ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మంగళవారం పిట్లం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బూత్ లెవల్ ఆఫీసర్ చేతుల మీదుగా ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి ఓటరు జాబితాలో తన పేరును నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్నవారు కూడా తమ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలి. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇంటింటికీ వెళ్లి సేవలందిస్తున్న బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలి. అర్హులైన ప్రతి ఒక్కరూ గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలి. కొత్తగా అర్హత సాధించిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, తహసీల్దార్ మహేందర్ కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సాయిలు, స్థానిక ఎన్నికల సిబ్బంది, బీఎల్‌ఓలు జయశ్రీ, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.






