- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూలై 4న మిడ్జిల్ మండలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక
జూలై 4న మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభతో పాటు విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా పరిశీలించారు.

దిశ, మిడ్జిల్ : జూలై 4న మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభతో పాటు విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మిడ్జిల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్, భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్. అంబేద్కర్ విగ్రహం, మాజీ మంత్రి ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాల ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ప్రజల సౌకర్యార్థం నిర్మించనున్న నూతన బస్ షెల్టర్‌కు ప్రతిపాదించిన స్థలాన్ని సందర్శించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సభా వేదిక, ప్రజలకు తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






