మౌళి ‘దొంగ నా కొడుకు’ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ!

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-30 09:54:43  IST  )

లడ్డు గాని పెళ్లి' అనే మాస్ సాంగ్‌లో తన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌తో కుర్రకారు మనసులు దోచుకున్న సుస్మితా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ చాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

మౌళి ‘దొంగ నా కొడుకు’ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ!
X

దిశ, సినిమా: మౌళి తనుజ్ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ ప్రారంభించిన టాలీవుడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో ఊహించని క్రేజ్ రాబట్టుకున్నారు. ఈ సిరీస్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడంతో పాటుగా.. ఇందులో నటించిన నటీనటుల క్రేజ్‌ను కూడా భారీగా పెంచిందని చెప్పాలి. దీంతో మౌళి ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. శివానీ నాగరం హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. మొదటి మూవీనే హిట్ కొట్టడంతో మౌళికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆయన తన రెండో సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేస్తుండటం విశేషం. పూర్తి యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే భారీ బజ్ ఏర్పడింది.

ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘దొంగ నా కొడుకు’ అనే వెరైటీ టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ను కన్ఫామ్ అయినట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. 'మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో 'లడ్డు గాని పెళ్లి' అనే మాస్ సాంగ్‌లో తన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌తో కుర్రకారు మనసులు దోచుకున్న సుస్మితా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ చాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్‌లోనూ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫుల్ లెంత్ ఎంటర్‌టైనింగ్ కథాంశంతో వస్తున్న ‘దొంగ నా కొడుకు’ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో లేదా సంవత్సరం చివరలో గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Next Story