- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏన్కూరు తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత
by Taduka Kalyani |
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం తీవ్ర సిబ్బంది కొరతతో నెట్టుకొస్తోంది.

X
దిశ, ఏన్కూరు: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం తీవ్ర సిబ్బంది కొరతతో నెట్టుకొస్తోంది. కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందడం లేదు. కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ (డీటీ), ఆర్‌ఐ-2, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు, ఇక్కడ పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో కార్యాలయంలో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. దీంతో కేవలం కొద్దిమంది ఉద్యోగులపైనే పనిభారం పడుతోంది. భూ సమస్యలు, ధ్రువపత్రాలు, ఇతర రెవెన్యూ సేవల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి, కార్యాలయంలో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Next Story






