- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
' ఫిరంగి మాయం పై పోలీసులకు ఫిర్యాదు '
రాజుల శౌర్యానికి, పరాక్రమానికి చిహ్నంగా నిలిచిన చారిత్రాత్మకమైన ఫిరంగి మాయమవడం పై మాజీ ఎమ్మెల్యే బక్కనే నర్సింహులు ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, షాద్ నగర్ : రాజుల శౌర్యానికి, పరాక్రమానికి చిహ్నంగా నిలిచిన చారిత్రాత్మకమైన ఫిరంగి మాయమవడం పై మాజీ ఎమ్మెల్యే బక్కనే నర్సింహులు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో స్థానిక మున్సిపల్ కార్యాలయం వెనుక ప్రహరీ గోడ వద్ద దుమ్ము పట్టిన ఫిరంగిని మంగళవారం బక్కని నర్సింహులు పరిశీలించి దుమ్ము పట్టిన ఫిరంగిని శుభ్రం చేసి రంగు వేయించారు. ఈ సందర్భంగా బక్కని నరసింహులు మాట్లాడుతూ గతంలో మున్సిపల్ కార్యాలయంలో రెండు ఫిరంగులు ఉండేవని, ప్రస్తుతం ఒకటి మాత్రమే కనిపిస్తుందని, రెండో ఫిరంగి ఎక్కడికి వెళ్ళిందని ప్రశ్నించారు. లక్షల రూపాయల విలువచేసే పురాతన ఫిరంగి కనుమరుగవ్వడం వెనక పలు అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు.
గత మున్సిపల్ పాలకవర్గం ఫిరంగులకు మరమ్మత్తులు చేసి ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసేందుకు రూ. 2 లక్షల నిధులను మంజూరు చేసిందని, నిధులు మంజూరైన ఫిరంగిని ఏర్పాటు చేయడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరంగి ఏర్పాటుకు మంజూరైన నిధులను ఏం చేశారంటూ ప్రశ్నించారు. మున్సిపల్ కార్యాలయంలో పురాతన ఫిరంగి మాయమవ్వడం పై మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా పురావస్తు శాఖ అధికారులు స్పందించి చారిత్రాత్మకమైన ఫిరంగిని భద్రపరిచి పరిరక్షించాలని, మాయమైన ఫిరంగి పై విచారణ చేపట్టాలని బక్కని నరసింహులు డిమాండ్ చేశారు.






